T20 World Cup 2024: సూర్యకుమార్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్: అమెరికా క్రికెటర్
- సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు
- జూనియర్ లెవల్‌లో భారత్ తరఫున బరిలోకి
- అండర్-15 రోజుల నుంచి నేను సూర్యని చూస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monank Patel Said I Played with Axar Patel and Jasprit Bumrah in India: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తాజాగా భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. ఓ దశలో రోహిత్ సేనను అమెరికా వణికించింది. ఇందుకు కారణం భారత సంతతి ఆటగాళ్లే. అమెరికా జట్టులో సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఆడుతున్నారు. అందులో కొంతమంది జూనియర్ లెవల్‌లో భారత్ తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమిండియాలో కీలకంగా ఉన్న కొందరి ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్‌స్పోర్ట్స్ చాట్‌లో అమెరికా ఆటగాళ్లు సౌరభ్ నేత్రావల్కర్, మోనాంక్ పటేల్.. భారత ప్లేయర్స్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సౌరభ్ నేత్రావల్కర్ మాట్లాడుతూ… ‘సూర్యకుమార్ యాదవ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండర్-15 రోజుల నుంచి నేను సూర్యని చూస్తున్నాను. అతడు అప్పుడే బాగా ఆడేవాడు. సూర్య ఎప్పుడూ ప్రత్యేక ఆటగాడే. అండర్-15, అండర్-17లో డబుల్ సెంచరీలు చేశాడు. అయితే నేను ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగా భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు సూర్య ఆటతీరుపై చాలా సంతోషంగా ఉన్నా. అతడిని కలుసుకోవడంతో ఆనందంగా ఉంది. ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Uttam Kumar Reddy : గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది
అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ… ‘నేను అండర్-15, అండర్-19 మ్యాచ్‌లలో అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నాది గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా. అక్షర్ మా జిల్లాలో చాలామంది యువకులను ప్రోత్సహించాడు. అతడు భారత జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అక్షర్ మంచి ప్లేయర్’ అని చెప్పాడు. గాయం కారణంగా మోనాంక్ పటేల్ టీమిండియాపై ఆడలేదు. ఆరోన్ జోన్స్ అతడి స్థానంలో సారథ్యం వహించాడు.
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..