USA vs CAN: కెనడాపై సంచలన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బోణీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో 7×4, 3×6), ఆరోన్ జోన్స్ (94; 40 బంతుల్లో 4×4, 10×6) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ నవనీత్ ధాలివాల్ (61; 44 బంతుల్లో 6×4, 3×6), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయాస్ మొవ్వ (32), ఆరోన్ జాన్సన్ (23) పర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!
ఛేదనలో అమెరికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0) డకౌట్ అయ్యాడు. కెప్టెన్ మోనాన్క్ పటేల్ (16) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో ఆండ్రిస్ గౌస్, ఆరోన్ జోన్స్ జోడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. 8 ఓవర్లకు యూఎస్ స్కోరు 48 మాత్రమే. అయితే ఆరోన్ విధ్వంసం సృష్టించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా సిక్సులతో విరుచుకుపడి కెనడా బౌలర్లకు చుక్కలు చూపించాడు.. దాంతో యూఎస్ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఆఖర్లో ఆండ్రీస్ ఔటైనప్పటికీ.. కోరే అండర్సన్ (3)తో కలిసి జోన్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడటం అమెరికాకు ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!