NTV Telugu Site icon

Team India: 17ఏళ్ల కల నెరవేరిన వేళ..ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న భారత్ జట్టు..

New Project (38)

New Project (38)

ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్‌ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. భారత జట్టు పోరాటం చేసివిజయ కిరీటాన్ని సంపాదించడంతో సంబరాలు మొదలయ్యాయి. బార్బడోస్ గడ్డపై రోహిత్ సేన జెండా పాతింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖరి బంతిని హార్దిక్ పాండ్యా వేయగానే.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ సహా అందరూ ఏడ్చారు. గత 17 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించిన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. తన సారథ్యంలో 17 ఏళ్ల కల నెరవేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. భారత్ జెండాను అక్కడ మైదానంలో పాతాడు.

READ MORE: Ramesh Rathod: ఉట్నూర్ లో నేడు మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు..

హార్దిక్ కన్నీటిపర్యంతం..
ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ట్రోల్‌కు గురైన హార్దిక్‌.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌ శర్మ అభిమానులకు అభివాదం చేసి కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాడు. బార్బడోస్‌లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, రోహిత్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని పాతిపెట్టినప్పుడు. హార్దిక్ భారత జెండాతో పిచ్‌పైకి వచ్చి ముద్దాడాడు.

READ MORE:Suryakumar Yadav Catch: ‘సూర్యా’ భాయ్.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌ (వీడియో)!

జట్టు విజయంలో విరాటుడి పాత్ర కీలకం..
అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచిన భారత జట్టుకు సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 75 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లి.. ఫైనల్‌లో హీరోగా నిలిచి భారత్ విజయానికి పునాది వేశాడు. 2024 టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తను కూడా భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. “ఇది నా చివరి టీ20 ప్రపంచకప్, మేం దీన్ని గెలవాలనుకున్నాం. భారత్‌కు ఇదే నా చివరి టీ20. పదవీ విరమణ చేయడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. మరియు కొత్త తరం ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది బహిరంగ రహస్యం.” అని పేర్కొన్నారు.