BCCI Demotes Kohli- Rohit: T20 వరల్డ్ కప్కి ముందు రోహిత్, కోహ్లీలకు బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన బీసీసీఐ
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన ఇండియన్ క్రికెట్ బోర్డు..
- కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించిన బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Demotes Kohli- Rohit: ఈరోజు నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) బిగ్ షాక్ ఇచ్చింది. భారత క్రికెట్‌లో ఒక యుగానికి ముగింపు పలికేలా బీసీసీఐ 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో భారీ మార్పులు చేసింది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు అగ్రశ్రేణి ఆటగాళ్లకు మాత్రమే కేటాయించిన A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కాంట్రాక్ట్ వ్యవస్థను మూడు గ్రూపులకే (A, B, C) పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది.
Read Also: Allu-Arjun : హీరో రెమ్యునరేషన్ అంటే ఇలా ఉండాలి! బన్నీ చూపించిన కొత్త దారి
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
కోహ్లీ, రోహిత్‌కు గ్రూప్ B:
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రూప్ Bకి డిమోట్ చేసింది. అయితే, దీనికి కారణం కూడా ఉంది.. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి విరమించుకున్నారు.. దీంతో వారు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతుండమే ప్రధాన కారణం. అందుకే అన్ని ఫార్మాట్లలో నిరంతరంగా ఆడే ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న బీసీసీఐ ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొత్త టాప్ కేటగిరీ – గ్రూప్ A:
ఇప్పటి నుంచి అత్యున్నత కేటగిరీగా గ్రూప్ A కొనసాగనుంది. ఇందులో అన్ని ఫార్మాట్లలో కీలక పాత్ర పోషిస్తున్న లేదా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ప్లేయర్స్ కు మాత్రమే చోటు కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
Read Also: Ragi Cookies Recipe: బయట కుకీస్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే పిల్లల కోసం క్రిస్పీ, హెల్తీ రాగి బిస్కెట్లు
గ్రూప్‌ల వారిగా ప్లేయర్స్ లిస్ట్:
* గ్రూప్ A:
శుభ్‌మన్ గిల్ (టెస్టు, వన్డే కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
* గ్రూప్ B:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.
గ్రూప్ C:
అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.
అయితే, ఈ మార్పులతో బీసీసీఐ స్పష్టంగా ఒక విషయం చెప్పింది. పేరు కంటే ప్రదర్శన, గత రికార్డుల కంటే ప్రస్తుత కంట్రిబ్యూషన్ ముఖ్యం అని తెలిపింది. రూ.7 కోట్ల విలువైన A+ కేటగిరీని తొలగించడంతో పని భారం (workload), అన్ని ఫార్మాట్లలో లభ్యత ఆధారంగా ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలన్న ఆలోచనను బీసీసీఐ ముందుకు తీసుకొచ్చింది. ఈ కొత్త కాంట్రాక్ట్ విధానం భారత క్రికెట్‌లో పరివర్తన దశను స్పష్టంగా చూపిస్తోంది. సీనియర్లకు గౌరవం కొనసాగుతూనే, యువతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్టుగా ఉంది ఈ జాబితా.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?