IND vs PAK Warm-up Matches: T20 ప్రపంచ కప్ వివాదం.. నేడు భారత్- పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌లు
- మరో మూడు రోజుల్లో పారంభం కానున్న టీ20 ప్రపంచకప్..
- నేడు టోర్నమెంట్ లో భారత్- పాకిస్థాన్ వార్మప్ మ్యాచులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Warm-up Matches: టీ20 వరల్డ్ కప్ 2026కు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్మ్-అప్ మ్యాచ్‌లు అభిమానులకు అదనపు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు జరగనుండగా, భారత్- పాకిస్థాన్ రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాయి. భారత జట్టు ఈరోజు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సాయంత్రం 5 గంటలకు పాక్ జట్టు ఐర్లాండ్‌తో పోటీ పడుతుంది.
Read Also: Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
భారత్–పాక్ వివాదం కొనసాగుతూనే…
అయితే, మైదానం బయట పరిస్థితులు మాత్రం రెండు జట్లకూ అనుకూలంగా లేవు.. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. మెగా టోర్నమెంట్‌లో టీమిండియాతో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే అనుమతి నిరాకరించిందని తెలుస్తుంది. ఈ అంశంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా సరే, ఇరు జట్లు మైదానంపై దృష్టి సారించి తమ తొలి మ్యాచ్‌లకు సిద్ధమవడం కీలకంగా మారింది. వార్మ్-అప్ మ్యాచ్‌లు జట్లకు సరైన సమన్వయం సాధించేందుకు ఉపయోగపడనున్నాయి.
Read Also: Jaishankar: అమెరికాలో జైశంకర్ పర్యటన.. ఆర్థిక సంబంధాలపై చర్చ
ఎక్కడ జరుగుతున్నాయి మ్యాచ్‌లు?
* భారత్- దక్షిణాఫ్రికా వార్మ్-అప్ మ్యాచ్ నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది.
* పాకిస్థాన్- ఐర్లాండ్ మ్యాచ్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరుగుతుంది.
* నమీబియా vs స్కాట్లాండ్ – మధ్యాహ్నం 1 గంటలకు, ఆఫ్ఘనిస్తాన్ vs వెస్టిండీస్ – మధ్యాహ్నం 3 గంటలకు ఈ రెండు మ్యాచ్‌లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వేర్వేరు మైదానాల్లో జరుగుతాయి. అయితే, భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లకు ఇవే చివరి వార్మ్-అప్ మ్యాచ్‌లు. తదుపరి వీరు నేరుగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ జోరు
ఇక, ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి వార్మ్-అప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆఫ్ఘన్ బౌలర్లు, చివరి నిమిషంలో బంగ్లాదేశ్ స్థానంలో టోర్నమెంట్‌లోకి వచ్చిన స్కాట్లాండ్‌ను కేవలం 123 పరుగులకే కట్టడి చేశారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!