SA vs AFG: తొలిసారిగా ఫైనల్‌కు చేరడం సంతోషం.. ఫైనల్ కోసం భయపడటం లేదు: మార్‌క్రమ్
- సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ చిత్తు
- తొలిసారి ఫైనల్‌కు దక్షిణాఫ్రికా
- ఫైనల్ కోసం భయపడటం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aiden Markram on South Africa Reach ICC T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ తెలిపాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఫైనల్ వరకు వచ్చామన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తాము భయపడటం లేదని, ఇదే ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్‌లో చేస్తామని మార్‌క్రమ్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. టీ20 ప్రపంచకప్ 2024లో సెమీఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.
మ్యాచ్ అనంతరం ఆదక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ… ‘తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ గెలుపు కేవలం నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఇదంతా జట్టు విజయమే. జట్టు విజయం వెనకాల చాలా మంది పాత్ర ఉంది. అదృష్టవశాత్తూ టాస్ ఓడిపోయాం. మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేద్దామనుకున్నాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరైన సమయాల్లో కీలక వికెట్లు తీశారు. పిచ్ చాలా కఠినంగా ఉంది. ఒక్కడ బ్యాటింగ్ చేయడం సవాల్‌గా మారింది. మాకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. వెంటవెంటనే వికెట్లు తీయడంతో సులువుగా విజయం సాధించాం’ అని చెప్పాడు.
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
Also Read: Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్.. జోరుగా బ్లాక్ టిక్కెట్ల దందా!
‘టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలంటే ఇంకో మెట్టు ఎక్కాల్సి ఉంది. ఈ అవకాశం ఇప్పటివరకు మాకు రాలేదు. వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం. ఫైనల్ మ్యాచ్ కోసం మేం భయపడటం లేదు. ఈ విజయమే మాకు గొప్ప. జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారు. అయితే విజయం సాధించాలంటే అందరి సమష్టి కృషి అవసరం. ఫైనల్ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేస్తాం’ అని మార్‌క్రమ్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 1992 నుంచి 2024 వరకు ఈ రెండు ఫార్మట్‌లలో 8 సార్లు సెమీస్‌కు చేరింది.
తాజావార్తలు
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!