Site icon NTV Telugu

Rohit Sharma: నా కోపానికి కారణం విరాట్ కోహ్లీ కాదు: రోహిత్ శర్మ

Rohit Kohli

Rohit Kohli

Rohit Sharma on His Aggressive Reaction vs BAN: టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌-8 గ్రూప్‌-1లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా తొలి వికెట్ పడిన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఇలా సంబరాలు చేసుకోవడానికి కారణం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని అందరూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు పెట్టారు. తాను అలా సంబరాలు చేసుకోవడానికి కారణం విరాట్ కాదని రోహిత్ స్పష్టం చేశాడు.

Also Read: IND vs AUS: నేడు భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్.. గెలిస్తేనే కంగారులను సెమీస్‌ ఆశలు!

విరాట్ కోహ్లీని ఔట్ చేసిన తర్వాత తన్జీమ్ హసన్ సకీబ్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. విరాట్ వైపు ఆవేశంగా చూస్తూ.. గట్టిగా అరుస్తూ అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి రివెంజ్‌గా బంగ్లా తొలి వికెట్ (లిట్టన్ దాస్) పడినపుడు రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని నెటిజెన్స్ పోస్ట్‌లు పెట్టారు. అయితే తన రివెంజ్‌కు అసలు కారణం ఏంటో మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. ‘లిట్టన్ దాస్ వికెట్ కోసం ముందే హార్దిక్ పాండ్యాతో చర్చించా. ప్రత్యేక ప్రణాళిక రచించాం. అందుకు తగ్గట్లుగా ఫీల్డింగ్ సెట్ చేశా. ఆ వ్యూహం ఫలించింది. ఆ ఎగ్జైట్‌మెంట్‌లో కాస్త గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నా’ అని వివరణ ఇచ్చాడు.

Exit mobile version