Rinku Singh: పాడె మోస్తూ, తండ్రికి రింకూసింగ్ భావోద్వేగ వీడ్కోలు..
- తుదిశ్వాస విడిచిన రింకూ సింగ్ తండ్రి..
- పాడె మోస్తూ భావోద్వేగ వీడ్కోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh: భారత బ్యాటర్ రింకూసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. టీ20 ప్రపంచ కప్ సమయంలో రింకూకు తండ్రి మరణం రూపంలో షాక్ తగిలింది. చెన్నైలో జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందే రింకూ తండ్రికి సీరియస్‌గా ఉన్నట్లు తెలియడంతో అతను నోయిడా వెళ్లి వచ్చారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆస్పత్రిలో ఖచంద్ సింగ్ మరణించారు. నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించడం రింకూ కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది.
Read Also: Pakistan Israel War: అప్పుడు భారత్, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్.. పాక్‌లో చైనా వ్యవస్థలు విఫలం..!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
జింబాబ్వే మ్యాచ్ ముగిసిన తర్వాత రోజే రింకూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో, రింకు తన తండ్రి మృతదేహాన్ని మోస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు, చుట్టూ పోలీసు సిబ్బంది, నివాళులు అర్పించడానికి గుమిగూడిన వందలాది మంది అభిమానులు ఉన్నారు.
జింబాబ్వే మ్యాచ్‌లో రింకూ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు. అభిషేక్ శర్మతో పాటు సంజు సామ్సన్ ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేయడంతో, జట్టు కూర్పు నుంచి రింకూ తప్పుకున్నాడు. ఈ టోర్నీలో రింకూ పెద్దగా బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయాడు. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు, రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 11 పరుగులు. ఆదివారం వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా చివరి సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది.
आंखों में आंसू, कंधे पर पिता की अर्थी…
क्रिकेटर रिंकू सिंह के पिताजी के निधन की खबर बेहद दुखद है। इस कठिन घड़ी में रिंकू और उनके परिवार के साथ पूरे देश की संवेदनाएं हैं।
ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को यह दुःख सहने की शक्ति प्रदान करे। 🙏#RinkuSinghFatherDemise pic.twitter.com/PUSPVIAt3l
— Dinesh Kumar (@DineshRedBull) February 27, 2026
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!