Nicholas Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. టీ20 ప్రపంచకప్ 2024లో అత్యధిక స్కోర్!
- సిక్స్‌లతో పూరన్ విధ్వంసం
- టీ20 ప్రపంచకప్ 2024లో అత్యధిక స్కోర్
- ఒబెడ్ మెక్కాయ్ మూడు వికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies Player Nicholas Pooran Hits 98 Runs against Afghanistan: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూపు-సీలో భాగంగా మంగళవారం సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 98 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పూరన్ విధ్వంసంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
Also Read: T20 World Cup 2024: బ్యాడ్ న్యూస్.. భారత్ ఆడే ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు భారీ అడ్డంకి!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) నిరాశారిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43)కు నికోలస్ పూరన్ తోడవ్వడంతో విండీస్ స్కోర్ పరుగులు పెట్టింది. హాఫ్ సెంచరీ ముందు చార్లెస్ పెవిలియన్ చేరినా.. 31 బంతుల్లో పూరన్ అర్ధ శతకం చేశాడు. ఇనింగ్స్ చివరలో పూరన్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. రషీద్ ఖాన్ వేసిన 18 ఓవర్లో ఏకంగా 24 రన్స్ బాదాడు. అయితే చివరి ఓవర్లో రెండు సిక్సులు బాదిన పూరన్.. అనూహ్యంగా రనౌట్ అయి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. హోప్ (25), పావెల్ (26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ఓడిపోయింది. ఇబ్రహీం జద్రాన్ (38) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ మూడు వికెట్స్ తీశాడు.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..