Afghanistan: సూపర్-8 చేరి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్!
- అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్
- ముజీబ్ ఉర్ రహ్మాన్ అవుట్
- సూపర్-8లో ఎలా రాణిస్తుందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mujeeb Ur Rahman has been replaced by Hazratullah Zazai: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 చేరి మంచి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. వేలి గాయం కారణంగా అతడు మెగా టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ జట్టులోకి చేరినట్లు పేర్కొంది.
అఫ్గనిస్తాన్ జట్టులోని ముజీబ్ ఉర్ రహ్మాన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. టీ20లలో అతడికి మెరుగైన రికార్డు ఉంది. అఫ్గాన్ తరఫున 46 టీ20లు ఆడిన ముజీబ్.. 59 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ఉగాండాపై మాత్రమే ముజీబ్ ఆడాడు. మూడు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీశాడు. గాయం కారణంగా మళ్లీ అతడు మైదానంలోకి దిగలేదు. ముజీబ్ స్థానంలో నూర్ అహ్మద్ బరిలోకి దిగాడు. మణికట్టు స్పిన్నర్ అయిన నూర్.. మెగా టోర్నీలో రెండు గేమ్‌లు ఆడాడు. న్యూజిలాండ్, పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లలో నూర్ ఆకట్టుకున్నాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Gold Price Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై రూ.660 పెరిగింది!
గ్రూప్-సీలో ఉన్న అఫ్గనిస్తాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై ముజీబ్ లాంటి కీలక బౌలర్ సేవలు కోల్పోవడం అఫ్గాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ.. పేసర్ ఫజల్‌హక్ ఫరూకీ రాణిస్తుండటం ఊరట కలిగించే అంశం. సూపర్-8లో అఫ్గాన్ ఎలా రాణిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!