T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లలో పాక్పై భారత్ ప్రదర్శన ఎలా ఉందంటే?.. ఫుల్ డిటైల్స్ ఇవే!
- రేపు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య హైటెన్షన్ మ్యాచ్..
- టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 8 సార్లు పోటీ పడిన భారత్, పాకిస్థాన్..
- ప్రపంచ కప్లో పాక్పై అత్యధిక సార్లు గెలిచిన రికార్డు భారత్ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో హైటెన్షన్ మ్యాచ్ రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. గత కొన్ని వారాలుగా నెలకొన్న వివాదాల అనంతరం ఇరు జట్లు ఈ మ్యాచ్ ఆడబోతున్నాయి. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ ఢాకాకు మద్దతుగా నిలిచింది. ఫిబ్రవరి 15న భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ సర్కార్ అనుమతి ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి. అయితే, పలు దఫాల్లో జరిగిన చర్చల అనంతరం చివరికి పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది.
Read Also: MS Dhoni: పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ ఎదుగుదలలో ఎంఎస్ ధోని కీలక పాత్ర..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
కాగా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 8 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ ఏడు సార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ‘మెన్ ఇన్ గ్రీన్’పై దాదాపు ఆధిపత్యం చూపిన టీమిండియా ఈ రికార్డును మరింత బలపర్చాలని టార్గెట్ గా పెట్టుకుంది.
Read Also: Pulwama Attack: పుల్వామా దాడిపై ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రకటనతో.. భారతీయుడి రక్తం మరిగింది!
ఇక, గ్రూప్ వివరాల్లోకి వెళితే, భారత్ ప్రస్తుతం తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించింది. 3.05 నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో కొనసాగుతుంది. అలాగే, సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు కూడా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లు సాధించింది. కానీ, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో సెకండ్ ప్లేస్ లో ఉంది. కాగా, ఈ హై వోల్టేజ్ పోరులో గెలిచిన జట్టుకు సూపర్-8కు చేరుకునే అవకాశాలు దాదాపు ఖాయం కానున్నాయి. దీంతో కొలంబోలో జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!