India Super 8 Schedule: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు ఫిక్స్.. మ్యాచ్‌ల పూర్తి జాబితా ఇదిగో!

  • సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు..
  • ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో..
  • ఫిబ్రవరి 26న జింబాబ్వేతో..
  • మార్చి 1న వెస్టిండీస్‌తో..
India Super 8 Schedule

India Super 8 Schedule

India Super 8 Schedule: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజి లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ..అద్భుత ప్రదర్శనతో సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ జట్టు సూపర్ ఫేమ్ తో అజేయంగా కొనసాగుతుంది. భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న USAపై విజయంతో ప్రారంభించింది. తరువాత ఫిబ్రవరి 12న నమీబియాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి గ్రూప్-Aలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Bomb Threat to Courts: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు

గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను నేడు (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ సూపర్-8 పోటీలపై దృష్టి పెట్టనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8లో భారత్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్నాయి. సూపర్-8లో టాప్-2 లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్‌ కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో భారత్ మూడు కీలక మ్యాచ్‌లు ఆడనుంది.

NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!

సూపర్-8లో టీమిండియా షెడ్యూల్:
* ఫిబ్రవరి 22 — భారత్ vs దక్షిణాఫ్రికా (అహ్మదాబాద్)

* ఫిబ్రవరి 26 — భారత్ vs జింబాబ్వే (చెన్నై)

* మార్చి 1 — భారత్ vs వెస్టిండీస్ (కోల్‌కతా).