Bomb Threat to Courts: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat to Courts: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ ప్రాంతాల్లోని కోర్టుల్లో బాంబులు పెట్టామని హెచ్చరించినట్టు సమాచారం అందింది. ముఖ్యంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
బాంబు బెదిరింపు సంబంధించిన ఈమెయిల్‌లో మధ్యాహ్నం 12:05 గంటలకు బాంబులు పేలుతాయని పేర్కొనడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. కోర్టు ప్రాంగణాల్లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ బెదిరింపు మెయిల్స్ ఫేక్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి అన్ని కోర్టు ప్రాంగణాలను పూర్తిగా తనిఖీ చేశారు.
Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ & కాశ్మీర్
మూడు క్రిమినల్ కోర్టులకు ఒకేసారి ఒకే సమయానికి బెదిరింపు మెయిల్స్ రావడం పోలీసులను మరింత అప్రమత్తం చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈమెయిల్స్ ఒకే వ్యక్తి లేదా ఒకే మూలం నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈమెయిల్స్ పంపిన వ్యక్తులు ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ పంపిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?