IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్.. గెలుపును సూచిస్తున్న కారణలిదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ ను ఐదుసార్లు ఎదుర్కొన్నప్పటికీ భారత్ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల గణాంకాలు, సెంటిమెంట్లు భారత్ ను విజేతగా నిలుస్తుందని చెబుతున్నాయి. మరో ఆ విశేషాలు, సెంటిమెంట్స్ ఏంటో చూసేద్దామా..
* జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి:
వైట్ బాల్ క్రికెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ ఉంది. వరల్డ్ కప్ టోర్నీలో ఎప్పుడైతే జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిందో.. ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం 1983 వన్డే వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆసీస్‌ను ఓడించింది. ఆ సమయంలో భారత్ విజేతగా నిలిచింది. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇదే జరిగింది. అప్పుడుకూడా భారత్ ఛాంపియన్ గా నిలిచింది. మళ్లీ ఇప్పుడూ టోర్నీలో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడంతో అభిమానులు ఇదే సెంటిమెంట్ మళ్లీ కచ్చితంగా రిపీట్ అవుతుందని భావిస్తున్నారు.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
India vs New Zealand: ఫైనల్‌కు ముందు షాకింగ్ లెక్కలు.. టాస్ గెలిచిన టీమ్‌కే కప్పు?
* హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్:
2011 వన్డే వరల్డ్ కప్‌లో సొంత గడ్డపై కప్పు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ దేశం కూడా సొంత గడ్డపై టైటిల్ గెలవలేదు. ఈసారి ఫైనల్ భారత్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. భారత్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్‌లో సొంత గడ్డపై ట్రోఫీ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
* సౌతాఫ్రికా చేతిలో ఓటమి:
భారత్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపించింది. గ్రూప్ స్టేజిలలో భారత్ ను ఓడగొట్టిన ఏకైక జట్టు సౌతాఫ్రికా కావడం విశేషం. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ కేవలం సౌతాఫ్రికాతో మాత్రమే ఓడిపోయింది, అప్పుడూ టైటిల్ గెలిచింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇప్పటివరకు భారత్ ఓడిపోయింది అదికూడా సౌతాఫ్రికాతోనే. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే భారత్‌కు మరోసారి కప్పు దక్కే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అనుకుంటున్నారు.
* భారత్ – ఇంగ్లాండ్ సెమీఫైనల్ ట్రెండ్:
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ – భారత్ మధ్య సెమీఫైనల్ జరిగినప్పుడు ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపించింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టే చివరికి ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి కారణం 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించింది. అప్పుడు ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. అదే 2024లో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. అప్పుడు భారత్ రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. ఇప్పుడు మరోసారి సెమీఫైనల్ లో కూడా భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించడంతో అదే ట్రెండ్ కొనసాగుతుందని అభిమానులు నమ్ముతున్నారు. చూడాలి మరి చివరకు ఏ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి భారత్ మూడోసారి విజేతగా నిలుస్తుందో..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!