T20 World Cup Row: గత్యంతరం లేక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నామన్న పాక్.. పాకిస్థాన్కి ఐసీసీ వార్నింగ్

  • భారత్‌తో మ్యాచ్‌ ఆడటానికి పాకిస్తాన్‌ తిరస్కరించిన అంశంపై ఐసీసీ చర్చలు..
  • గత్యంతరం లేక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నామని తెలిపిన పాకిస్థాన్..
  • భారత్‌తో మ్యాచ్‌ ఎందుకు ఆడటం లేదో సరైన కారణం చెప్పాలని తెలిపిన ఐసీసీ
Icc

Icc

T20 World Cup Row: టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడటానికి పాకిస్తాన్‌ తిరస్కరించిన అంశంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంత ఈజీగా వదిలి పెట్టేలా కనిపించడం లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ రెడీ అయింది. ఇక, భారత్‌తో మ్యాచ్‌ ఆడే విషయం తమ చేతుల్లో లేదని, తమ సర్కార్ ఆదేశాల ప్రకారం నడుస్తున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిం.. ఐసీసీ నిబంధన (ఫోర్స్‌ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సమాధానం ఇచ్చింది.

Read Also: T20 World Cup: జయహో భారత్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రికార్డ్స్ బ్రేక్..

అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి దీనికి సరైన రీతిలో రియాక్ట్ అయింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడే ఈ రూల్ వర్తిస్తుంది.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని పాక్ క్రికెట్ బోర్డును ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటం కానీ, ప్రత్యామ్నాయం కోసం ట్రై చేయడం గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా క్లారిటీ చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే తదుపతి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన పాకిస్థాన్ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15వ తేదీన భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..?