Sehwag-Shakib: సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు.. షకీబ్ అల్ హసన్ కౌంటర్!
- నువ్ హెడ్‌న్-గిల్‌క్రిస్ట్ కాదు
- నీకు తెలిసిన షాట్స్ ఆడు
- సెహ్వాగ్‌కు షకీబ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan React on Virender Sehwag’s Criticism: తనపై విమర్శలు చేసిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గట్టి కౌంటర్ వేశాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ జర్నలిస్టును ప్రశ్నించాడు. విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదని సెహ్వాగ్‌ను ఉద్దేశించి అన్నాడు. సెహ్వాగ్ గురించి షకీబ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఇంతకీ సెహ్వాగ్-షకీబ్ మధ్య ఏం జరిగిందంటే?..
టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో షకీబ్ అల్ హసన్ నిరాశపరిచాడు. శ్రీలంకపై 8, దక్షిణాఫ్రికాపై 3 రన్స్ చేసిన షకీబ్.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. ముఖ్యంగా ప్రొటీస్ మ్యాచ్‌లో అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ. అనవసర షాట్లకు అవుట్ కావడం ఏంటి, ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన క్రికెటర్ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు. షార్ట్ పిచ్ బాల్స్ ఆడడానికి నువ్వేమీ మాథ్యూ హెడ్‌న్, ఆడం గిల్‌క్రిస్ట్ కాదని.. ఓ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి అని హేళన చేశాడు. నీ ప్రమాణాలు నువ్వు తెలుసుకొని.. నీకు తెలిసిన షాట్స్ ఆడాలని షకీబ్‌కు వీరూ సలహా ఇచ్చాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Xiaomi 14 Civi Price: భారత్‌లో ‘షావోమీ’ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 రన్స్ ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మ్యాచ్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్నాక మీడియా సమావేశంలో షకీబ్ పాల్గొనగా.. వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యల గురించి ఓ జర్నలిస్టు అడిగాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ కౌంటర్ వేశాడు. ‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు. జట్టుకు తాము ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే విమర్శలు చేస్తారు’ అని షకీబ్ అన్నాడు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!