Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!

Abhishek Sharma (1)

Abhishek Sharma (1)

Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియా ఫాన్స్ ను ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ లోనూ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్థాన్‌పై వరుసగా డకౌట్ అయిన అభిషేక్.. తాజాగా నెదర్లాండ్స్‌పై కూడా డకౌట్ గా వెనుదిరగడంతో ఓ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.

India AI Impact Summit 2026: AI రంగంలో విశ్వగురువుగా భారత్! నేడే ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ప్రారంభం..

నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడో బంతికే అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్యన్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు అభిషేక్ ప్రయత్నించగా.. బంతి వేగంగా దూసుకొచ్చి స్టంప్స్‌ను ఎగరగొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ సహచర ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ జెర్సీని ధరించడం గమనార్హం. జెర్సీ మారినా అభిషేక్ రాత మాత్రం మారలేదు.

ఈ టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా మూడు సార్లు సున్నాకే వెనుదిరగడంతో.. భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా ఆశిష్ నెహ్రాతో కలిసి అభిషేక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్), తిలకరత్న దిల్షాన్ (శ్రీలంక) తలో ఐదు డకౌట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌కు ముందు సునీల్ గవాస్కర్ అభిషేక్ శర్మకు ఒక విలువైన సలహా ఇచ్చారు. “అభిషేక్ ఫామ్‌లో ఉన్నాడు.. కానీ, అతను అనవసరంగా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. నా సలహా ఏంటంటే.. ముందుగా ఒక సింగిల్ తీసి ఖాతా తెరవాలి. కాళ్లు వేగంగా కదులుతూ ఒక పరుగు తీస్తే ఆ తర్వాత భారీ షాట్లు ఆడొచ్చు అని పేర్కొన్నారు. అయితే గవాస్కర్ ఇచ్చిన సలహాను అభిషేక్ అమలు చేయలేకపోయాడు.

Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!

ఇలా అభిషేక్ డక్ అవుట్ అవుతుంటే.. కొందరు అభిమానులు నీకంటే సంజు మేలు అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో ఒక అడుగు ముందుకు వేసి ఇక ఆయన సేవలు జట్టుకు ఆపేయండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి తన మొదటి ఐసీసీ (ICC) టోర్నీలో ఆడుతున్న అభిషేక్ శర్మ.. సూపర్-8లోనైనా ఫామ్‌లోకి వచ్చి పరుగుల వేట మొదలుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.