MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు

  • 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా లేదా? అని ఉత్కంఠ..
  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధోనీ..
  • వయస్సు కాదు.. ఫిట్‌నెస్, ఫామ్ ముఖ్యం.. అందరికీ ఒకే రూల్ ఉండాలి: ఎంఎస్ ధోనీ
Roko

Roko

MS Dhoni: భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తి రేపే ప్రశ్నల్లో ఒకటి – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా మాజీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది.. మొదట ధోని సరదాగా విననట్టు నటించాడు.. కానీ, వెంటనే సీరియస్‌గా స్పందిస్తూ.. వయస్సు కంటే ఫిట్‌నెస్, ప్రదర్శనలే అసలైన ప్రమాణాలు అని తేల్చి చెప్పాడు.

Read Also: Smart Glasses Privacy Risks: అమ్మాయిలూ జాగ్రత్త.. స్మార్ట్ గ్లాసెస్‌తో మహిళల ప్రైవసీ వీడియోలు రికార్డ్!

వయస్సు కాదు.. ఫిట్‌నెస్, ఫామ్ ముఖ్యం:
2027 వరల్డ్ కప్ ఎందుకు ఆడకూడదు? వయస్సు ఎప్పుడూ ప్రమాణం కాదు.. ప్రదర్శన, ఫిట్‌నెస్ అసలు క్రైటీరియా అని మహేంద్ర సింగ్ ధోని అన్నారు. 22 ఏళ్లవాడైనా ఫిట్ లేకపోతే జట్టులో ఉండకూడదు.. అదే 35 ఏళ్లవాడు ఫిట్‌గా, బాగా ఆడితే అతన్ని ఆడించాల్సిన అవసరం ఉందన్నారు. తాను భారత జట్టులోకి వచ్చినప్పుడు తన వయస్సు గురించి ఎవరూ ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా అందరినీ సమానంగా చూడాలని సూచించారు. “రోహిత్, విరాట్ లేదా భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లు– ఎవరికైనా ఒకే నియమాలు వర్తించాలి.. ఆడాలా వద్దా అన్నది వాళ్లే నిర్ణయించుకోవాలి.. దేశం కోసం ఆడాలనే ఆకాంక్ష ఉంటే, ప్రదర్శన కొనసాగితే ఎందుకు ఆపాలి? అని అడిగారు.

Read Also: Hyderabad: రూ.3 వేల లోన్‌కే న్యూడ్ ఫోటోలతో బెదిరింపులు.. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి

ప్రపంచకప్‌లో అనుభవం కీలకం:
ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో అనుభవం ఎంత ముఖ్యమో కూడా ఎంఎస్ ధోని వివరించాడు. 20 ఏళ్ల వయస్సులోనే అనుభవం వస్తుందనుకోవడం తప్పు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడే నిజమైన అనుభవం వస్తుంది అన్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే వాళ్లు లేదా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు అనుభవం చాలా అవసరం అని తెలిపారు.

యువత + అనుభవం = విన్నర్ టీం:
జట్టు ఎంపికలో యువత ఉత్సాహం, సీనియర్ల అనుభవం రెండూ అవసరమని మిస్టర్ కూల్ ధోని అభిప్రాయపడ్డాడు. అయితే, 24 ఏళ్ల ఆటగాడికి ఎలాంటి ప్రమాణాలు ఉంటాయో, 35 ఏళ్ల ప్లేయర్ కీ కూడా అవే ఉండాలని సూచించారు. ప్రదర్శన ఉంటే ఆడతారు.. లేకపోతే ఎప్పుడైనా జట్టులో నుంచి తప్పిస్తారు అన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి గురించి ప్రశ్నే ఉండకూడదని తేల్చేశాడు. మొత్తానికి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్‌లో ఆడతారా? అన్న ప్రశ్నకు మహేంద్ర సింగ్ ధోని సమాధానం స్పష్టం చేయడంతో రాబోయే వరల్డ్ కప్ నాటికి వీరు ఇరువురు ఫామ్ లో ఉంటే తుది జట్టులో ఉండే అవకాశం మెరుగ్గా ఉంటుంది.