భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా రెండు సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. రాంచీ వన్డేలో 120 బంతుల్లో 153 రన్స్ చేసిన కింగ్.. రాయపూర్ వన్డేలో 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో విరాట్ వరుసగా సెంచరీలు చేయడం ఇది 11వ సారి. తనను ‘కింగ్’ అని ఎందుకు పిలుస్తారో కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఇక…
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్‌కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు…
2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడడం డౌటే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీకి చాలా సమయం ఉందని.. అప్పటివరకు ఇద్దరు తమ ఫామ్, ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటారో చూడాలన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతో కోహ్లీ, రోహిత్‌లను జట్టు నుంచి పక్కన పెట్టేసినట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే అని ఏబీడీ పేర్కొన్నాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం…
Rohit- Kohli: 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేయాలంటే బీసీసీఐ ఓ కండీషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం అయ్యే.. విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దరూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం పరిగణనలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది.
Virat Kohli & Rohit Sharma’s ODI future and the 2027 World Cup టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా పడడంతో ఇద్దరు మైదానంలోకి దిగడానికి మరిన్ని రోజుల సమయం పట్టనుంది. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లు ఆడనున్నారు. అయితే ఇంగ్లండ్‌పై కుర్రాళ్లు ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేయడం ఈ…
ప్రపంచ వ్యాప్తంగా 45 రోజులపాటు వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్ వరకు వచ్చి ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఈసారి టైటిల్ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్న టీమిండియా అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వరల్డ్ కప్ మహా సంగ్రామం ముగిసిపోయింది. దీంతో తర్వాత వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే వరల్డ్ కప్ లో కొందరు స్టార్ ఆటగాళ్లు దూరంకానున్నారు.