T20 World Cup 2026: బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది?.. పీసీబీపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!
- భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్థాన్
- పీసీబీ ఆలోచనపై అక్రమ్ తీవ్ర అసంతృప్తి
- బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది? అంటూ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లా ఆడకపోతే.. పాకిస్థాన్ కూడా బహిష్కరిస్తుంది అనే పీసీబీ ఆలోచనపై అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా ఆలోచనలు పాకిస్థాన్ క్రికెట్‌కు మేలు చేయవని స్పష్టం చేశారు. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దాయాదుల మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో షెడ్యూల్ అయి ఉంది.
‘బంగ్లాదేశ్ ఆడకపోతే పాకిస్థాన్ ఎందుకు టీ20 వరల్డ్‌కప్ 2026ను బహిష్కరించాలి?. అసలు పాకిస్థాన్ క్రికెట్‌కు బంగ్లాదేశ్ ఏం చేసింది?. ఇందులో నాకు ఎలాంటి లాజిక్ కనిపించడం లేదు. ఇతర దేశాల నిర్ణయాలపై ఆధారపడి పీసీబీ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’ అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం దృష్టి పెట్టాల్సింది రాజకీయాలు, వివాదాలపై కాదని.. ఆటపై మాత్రమేనని అని అన్నారు. ‘పాకిస్థాన్ క్రికెట్ ముందుగా తన సమస్యలపై దృష్టి పెట్టాలి. జట్టు ఆటను మెరుగుపర్చుకోవాలి. వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి’ అని అక్రమ్ సూచించారు.
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
Also Read: Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్?.. పాన్ ఇండియా స్టార్మ్ పక్కా!
వసీం అక్రమ్ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఓ మంచి సందేశం అనే చెప్పాలి. వివాదాల్ని పక్కనపెట్టి.. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు సమతుల్యతపై ఫోకస్ చేస్తేనే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తిరిగి బలమైన జట్టుగా నిలుస్తుందని అక్రమ్ చెప్పుకొచ్చారు. అక్రమ్ వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నారు. మరో 2 రోజుల్లో ఐసీసీ సమావేశం జరిగే అవకాశముంది. ఆ భేటీలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్థాన్‌ను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?