T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!
- టీ20 వరల్డ్‌కప్ 2026కి ప్రపంచవ్యాప్తంగా స్పందన
- 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్
- భారత్ పాల్గొన్న మ్యాచ్‌కు అత్యధిక వ్యూయర్‌షిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Hotstar T20 WC 2026 Views: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026కి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌లకు జియో హాట్‌స్టార్‌లో మొత్తం 875 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే.. మెగా టోర్నీపై ఎంత క్రేజ్ ఉందో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ పాల్గొన్న మ్యాచ్‌లు అత్యధిక వ్యూయర్‌షిప్‌ను నమోదు చేయడం విశేషం. మూడింటిలో ఓ వంతు వ్యూయర్‌షిప్ టీమిండియా ఆడిన మ్యాచ్‌కే వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
వ్యూస్ పరంగా టాప్ స్థానంలో భారత్ vs అమెరికా మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఏకంగా 260 మిలియన్ మంది వీక్షించారు. రెండో స్థానంలో పాకిస్థాన్ vs అమెరికా మ్యాచ్ ఉండగా.. 91 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 86 మిలియన్ వ్యూస్‌తో ఇంగ్లండ్ vs వెస్టిండీస్ మ్యాచ్ మూడో స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ 68 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. శ్రీలంక vs ఐర్లాండ్ మ్యాచ్ 58 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది.
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: PSL 2026 Auction: అత్యంత ఖరీదైన ఆటగాడు నసీమ్ షా.. టాప్-5 లిస్టులో డేవిడ్ వార్నర్!
మిగతా మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా vs కెనడా (52M), నేపాల్ vs ఇంగ్లండ్ (49M), న్యూజిలాండ్ vs అఫ్గానిస్థాన్ (41M), పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ (40M), వెస్టిండీస్ vs స్కాట్లాండ్ (31M), ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ (29M), న్యూజిలాండ్ vs యూఏఈ (27M), స్కాట్లాండ్ vs ఇటలీ (16M), జింబాబ్వే vs ఒమాన్ (14M), నమీబియా vs నెదర్లాండ్స్ (13M) వరుసగా ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఎంతగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్‌లకు భారీగా వ్యూయర్‌షిప్ రావడం వల్ల టోర్నీకి మరింత హైప్ ఏర్పడింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రికెట్ వీక్షణ పెరుగుతున్నదానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వ్యూయర్‌షిప్‌లో రికార్డు నెలకొల్పనుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!