Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!
- టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన భారత్
- వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్లేయర్స్
- టీమిండియా గురించి ఓ ఆసక్తికర న్యూస్
- గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir vs Ajit Agarkar Disagreement Over Shubman Gill Selection: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి.. పొట్టి కప్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ ఇళ్లకు చేరుకొని వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో టీమిండియా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికొచ్చింది. టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక సందర్భంగా కీలక చర్చలు జరిగాయని సమాచారం. ముఖ్యంగా యువ బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపిక విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రిపోర్టుల ప్రకారం.. 2026 టీ20 వరల్డ్ కప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పనిసరిగా చేర్చాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. అతని టెక్నికల్ క్లాస్, స్థిరమైన బ్యాటింగ్ టీమ్‌కు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడట. అయితే జట్టు కాంబినేషన్ విషయంలో సెలెక్టర్ అజిత్ అగర్కర్ తన నిర్ణయంను మార్చుకోలేదట. టీ20 ఫార్మాట్‌లో దూకుడైన ఆటగాళ్లు జట్టుకు మరింత ఉపయోగపడతారని అగార్కర్ భావించాడట. అందుకే సెలెక్టర్లు ఇషాన్ కిషన్, రింకూ సింగ్ వంటి హిట్టర్లను జట్టులోకి ఎంపిక చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారట.
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
Also Read: Ishan Kishan T20 Rankings: 64 నుంచి 2కు.. ఇషాన్ కిషన్ సూపర్ కంబ్యాక్!
సెలెక్టర్ల అభిప్రాయం ప్రకారం శుభ్‌మన్ గిల్ మంచి ఆటగాడే అయినప్పటికీ.. 2026 టీ20 వరల్డ్ కప్ జట్టులో ప్రతి ఆటగాడికి ప్రత్యేక పాత్ర అవసరమని భావించారు. ఆ కారణంగానే గిల్ ఈసారి జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని సమాచారం. మెగా టోర్నీ ముందు గిల్ ఫామ్ కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిణామాలు భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గౌతమ్ గంభీర్-అజిత్ అగార్కర్ మధ్య జరిగిన ఈ చర్చ.. టీమ్ సెలక్షన్‌లో ఎంతగా ఆలోచనలు ఉంటాయో స్పష్టంగా తెలుస్తోంది. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. అగార్కర్ నిర్ణయం సరైందే అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!