Sunrisers Hyderabad Scored 76 Runs In First 10 Overs Against CSK: చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి.. 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న హ్యారీ బ్రూక్ (18) ఇక విధ్వంసం సృష్టిస్తాడని అనుకునేలోపే.. క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి రాగా.. అతనితో కలిసి అభిషేక్ శర్మ కాస్త ఆశాజనకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కి 36 పరుగులు జోడించారు. మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ వచ్చిన అభిషేక్ శర్మ.. ఖాతా తెరువాలని భావించాడు. బౌండరీల వర్షం కురిపించాలని అనుకున్నాడు. కానీ.. ఈ దూకుడులోనే అతడు కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది గాల్లో ఎగిరి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.
Peacefull Countries: ప్రపంచంలోని టాప్-10 శాంతియుత దేశాలు

ఇక చెన్నై బౌలర్ల విషయానికొస్తే.. సన్‌రైజర్స్ బ్యాటర్లకు భారీ షాట్లు ఆడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు కొన్ని బ్యాడ్ బాల్స్ పడుతున్నాయే తప్ప.. సాధ్యమైనంతవరకు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆకాశ్ సింగ్ అయితే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒకే లెంగ్త్ బంతులు వేయకుండా, కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కన్ఫ్యూజన్‌లోనే బ్రూక్ షాట్ బంతి వచ్చిందని టెంప్ట్ అయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. అతడు బ్రూక్ లాంటి గొప్ప వికెట్ తీసి.. చెన్నైకి ఊరట కల్పించాడు. ఆ తర్వాత జడేజా కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. అభిషేక్ శర్మ మంచి ఊపు మీద ఉన్నాడన్న విషయం తెలిసి.. అతడ్ని టెంప్ట్ చేసేందుకు షాట్ బాల్ వేశాడు. మొత్తానికి అతని ప్లాన్ వర్కౌట్ అయ్యింది. షాట్ బాల్ చూసి అభిషేక్ టెంప్ట్ అయ్యి.. ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. మరి.. మిగతా పది ఓవర్ల ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి.