Sunrisers Hyderabad Scored 134 In 20 Overs Against CSK: చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ స్కోరుకే తట్టాబుట్టా సర్దేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. దీంతో.. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే చెన్నై జట్టు 135 పరుగులు చేయాల్సి ఉంటుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. మొదట్లో ఆశాజనకమైన ప్రదర్శనే కనబర్చింది. రెండు వికెట్లు పడేంతవరకూ.. హైదరాబాద్ స్కోరు క్రమంగా పెరుగుతూ వచ్చింది. బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా వాటిని బౌండరీలుగా మలిచారు. 71 పరుగుల వద్ద రెండో వికెట్ పడేదాకా.. హైదరాబాద్ ఇన్నింగ్స్ కాస్త మెరుగ్గానే కనిపించింది.
Samyukta Menon: నక్క కాదు దానికి మించిన తోక తొక్కి ఉంటుంది..

కానీ.. ఎప్పుడైతే రెండో వికెట్ పడిందో, అప్పటి నుంచే ఎస్ఆర్‌హెచ్ పతనం మొదలైంది. ఒకరి తర్వాత మరొకరు బ్యాటర్లు వరుసబెట్టి పెవిలియన్ బాట పట్టారు. ఈసారి మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. ఏ ఒక్కరూ కూడా కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయారు. జట్టుకి స్కోరుని జోడించడంలో.. తమవంతు కృషి అందించలేకపోయారు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లి.. తమ వికెట్లను సమర్పించుకున్నారు. అంచనాలు పెట్టుకున్న స్టార్ ఆటగాళ్లందరూ చేతులు ఎత్తేశారు. హ్యారీ బ్రూక్ విఫలమైనప్పుడు కెప్టెన్ మార్ర్కమ్ ఉన్నాడని భావిస్తే.. అతడు కూడా 12 వ్యక్తిగత పరుగులే చేసి ఔట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాల్.. ఈ మ్యాచ్‌లో రెండు పరుగులకే జెండా ఎత్తేశాడు. భారీ షాట్ కొడదామని ముందుకొచ్చి.. ధోనీ చేతిలో స్టంప్ ఔట్ అయ్యాడు. ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే.. టాపార్డర్ కాస్త పర్వాలేదనిపిస్తే, మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. అందుకే.. హైదరాబాద్ జట్టు 134 పరుగులకే తట్టాబుట్టా సర్దేయాల్సి వచ్చింది.
SRH vs CSK: నిదానంగా సాగుతున్న సన్‌రైజర్స్.. 10 ఓవర్లలో ఇది పరిస్థితి
ఇక చెన్నై బౌలర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో మరోసారి తన సత్తా చాటాడు. తమ స్పిన్ మాయాజాలంతో సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, వాళ్లకు షాట్లు కొట్టే ఆస్కారం ఇవ్వలేదు. ఆకాశ్ సింగ్, తీక్షణ, పతిరానాలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఏ ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకోలేదు. అందరూ పొదుపుగా బౌలింగ్ వేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. సన్‌రైజర్స్‌ని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇప్పుడు సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే.. బౌలర్లు అద్భుతమే చేయాల్సి ఉంటుంది. మరి.. సన్‌రైజర్స్ బౌలర్లు ఎలా రాణిస్తారో? చెన్నై ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి.