యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చాలా ఘోరంగా ఓడిపోయింది. అందులో మొదటి మ్యాచ్ ను పాకిస్థాన్ పై 10 వికెట్ల తేడాతో అలాగే రెండో మ్యాచ్ న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది ఇండియా జట్టు. అయితే గత మ్యాచ్ లో భారత ప్రదర్శన పై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… పాకిస్థాన్ పైన ఓటమే భారత జట్టును దెబ్బతీసింది అన్నాడు. టీం ఇండియాకు చిరకాల ప్రత్యర్థి అయిన పాక్ పై 10 వికెట్ల తేడాతో ఓడిపోవడని జట్టు తట్టుకోలేకపోతుందని… ఆ కారణంగానే జట్టు మానసికంగా బలహీన పడిందని పేర్కొన్నారు గావర్కర్. అయితే భారత జట్టు రేపు ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో తలపడుతుంది. మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన విజయం సాధించగలదా… లేదా అనేది చూడాలి.