SRH Won The Toss And Chose To Field: మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ ఫీవర్ మొదలైన సంగతి తెలిసిందే! ఈరోజు ఆదివారం కావడంతో.. ఐపీఎల్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఆఫర్ ఉంది. అంటే.. రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అందులో మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి.. సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉందంటూ పేరుగాంచింది. బ్యాటింగ్ పరంగా బలహీనమైనప్పటికీ.. బౌలింగ్ పరంగా మాత్రం ప్రత్యర్థుల్ని మట్టికరిపిస్తుందని పేరు ఈ జట్టుకి ఉంది. మరి.. ఈసారి ఈ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
Perni Nani: మంత్రి వర్గంలో మార్పులా? అదంతా పబ్లిసిటీ స్టంటే
అటు.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో మంచి బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా.. ఇన్నింగ్స్‌ని మలుపు తిప్పగల భీకరమైన బ్యాటర్లు కొందరున్నారు. ఒకవేళ వాళ్లు క్రీజులో కుదురుకుంటే మాత్రం.. ఇక మైదానంలో బౌండరీల వర్షమే! అలాగే.. కీలక సమయంలో వికెట్లు తీయగల బౌలర్లూ ఉన్నారు. మరి.. ఈ ఇరుజట్ల మధ్య ఈరోజు జరుగుతున్న పోరులో.. ఎవరు పైచేయి సాధిస్తారో, మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఇరుజట్ల అభిమానులైతే.. తమతమ అభిమాన జట్టు గెలవాలని బలంగానే కోరుకుంటున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్, టి.నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యజువేంద్ర చహల్.
Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 22 మందితో వెళ్తూ లోయలో పడిన బస్సు