ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ రోజు మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఎస్‌ఆర్‌హెచ్ పట్టిష్టమైన ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌ను ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్.. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై విజయం సాధించిన ఇరు జట్లు.. నేటి మ్యాచ్‌లోనూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. చూడాలి మరి విజయం ఎవరి సొంతమో..?