దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో టీ20 సమరానికి సిద్ధమైంది. గౌహతి వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 ఆడిన జట్టుతోనే భారత్ ఆడనుంది. దక్షిణాఫ్రికా మాత్రం తుది జట్టులో ఒక మార్పు చేసింది. షాంసీ స్థానంలో లుంగీ ఎంగిడికి స్థానం కల్పించింది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
తుది జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అశ్విన్, దీపక్ చాహర్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రోసౌ, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, నోర్జే, లుంగీ ఎంగిడి
South Africa have won the toss and elect to bowl first in the 2nd T20I.
A look at #TeamIndia's Playing XI here 👇👇
Live – https://t.co/R73i6RryDA #INDvSA @mastercardindia pic.twitter.com/gnw3eUMWPD
— BCCI (@BCCI) October 2, 2022