Site icon NTV Telugu

Team India Playing XI: జట్టులోకి గిల్ ఎంట్రీ- సంజూ ఔట్.. సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే తుది జట్టు ఇదే

Gill

Gill

Team India Playing XI: టెస్ట్‌ సిరీస్‌లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్‌ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్‌పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది. 2026 T20 వరల్డ్‌కప్‌ కోసం సన్నద్ధతలో భాగంగా, దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడబోతుంది. మెగా టోర్నీ ముందు ఉండే చివరి సిరీస్ ఇదే. అయితే, తొలి మ్యాచ్‌ రేపు (డిసెంబర్‌ 9) కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.

Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

ఇక, కోల్‌కతా టెస్ట్‌లో మెడ గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్ లకు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అభిషేక్‌ శర్మతో కలిసి గిల్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్ ఉంది. ఆ తరువాత తిలక్‌ వర్మ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక, వికెట్‌ కీపర్‌గా జితేష్‌ శర్మకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఆసియా కప్‌లో గాయంతో దూరమైన హార్దిక్‌ పాండ్యా సైతం ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. టీమిండియా ముగ్గురు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: Tension at Gangavaram Port: గంగవరం పోర్టు దగ్గర టెన్షన్‌.. టెన్షన్‌..

అయితే, హెచ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ అవలంభిస్తున్న ధోరణి ప్రకారం, ఆలౌరౌండర్ కోటాలో ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌లను ఎంపియ చేయడంతో వాషింగ్టన్‌ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం రాకపోవచ్చు.. అలాగే, ఓపెనర్ గా సంజూ శాంసన్‌ కూడా బెంచ్‌కే పరిమితం కావొచ్చే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, భారత్‌ ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలకు తుది జట్టులో అవకాశం ఇవ్వనున్నారు. దీంతో పాటు స్పెషలిస్ట్‌ పేసర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా ప్లేయింగ్‌ XIలో స్థానం సంపాదించే ఛాన్స్ ఉండటంతో అర్శ్‌దీప్‌ సింగ్‌ సైతం ఈ మ్యాచ్‌కు దూరమైనట్లే కనిపిస్తుంది.

భారత జట్టు ప్లేయింగ్‌ XI:
శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేష్‌ శర్మ, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.

Exit mobile version