Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer About Captaincy Struggles: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ అదరగొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రేయాస్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ (57; 22 బంతుల్లో), అభిషేక్ శర్మ (39; 19 బంతుల్లో), ఇషాన్ కిషన్ (38 నాటౌట్; 23 బంతుల్లో), నితీశ్ కుమార్ రెడ్డి (3/24)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అఫ్గానిస్థాన్‌పై రెండో టీ20లో విజయంపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘జట్టు వరుస విజయాలపై చాలా సంతోషంగా ఉంది. గత మ్యాచ్‌లోని ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లో మంచి విజయం సాధించాలనుకున్నాం. ఈ రోజు మేము సాధించిన విజయం దానికి సరైన ఉదాహరణ. మా అంచనాలకు తగ్గట్టుగానే ఆటగాళ్లు రాణించారు. కెప్టెన్సీలో నాకు మంచి ఆరంభం దక్కలేదు. ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆ పరిస్థితి కఠినంగా అనిపించింది. ఓ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే క్రికెట్లో ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలి. గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించాలి’ అని సర్పంచ్ సాబ్ చెప్పాడు.
Also Read
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
‘పరిస్థితిని ఎంతగా స్వీకరిస్తే అంత మెరుగ్గా ఉంటుంది అనే విషయాన్ని నేను గత ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను. క్లిష్ట పరిస్థితులను అంగీకరించడం ద్వారా వాటిని అధిగమించడం సులభమవుతుంది. ఇప్పుడు వరుస విజయాలు దక్కుతున్నాయి. ఫుల్ హ్యాపీగ ఉన్నాను. ఇదే జోరును కొనసాగించాలనుకున్నా. తదుపరి మ్యాచ్‌లో మార్పులు ఉంటాయి. అందరూ పిచ్, పరిస్థితులకు అలవాటు పడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే వారికి కొంత మ్యాచ్ ప్రాక్టీస్ కూడా అవసరం. కాబట్టి తదుపరి మ్యాచ్‌లో ఇప్పటివరకు తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తాం. అదే సమయంలో జట్టు కాంబినేషన్లో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది’ అని శ్రేయస్ వెల్లడించాడు. దీంతో తదుపరి మ్యాచ్‌లో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?