Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni vs Rohit Sharma Captaincy: ఎంఎస్ ధోనీనా? లేదా రోహిత్ శర్మనా?.. భారత టీ20 క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించారు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వంతు వచ్చింది. ఇద్దరు దిగ్గజాల సారథ్యంలో ఆడిన దూబేకు ఈ ప్రశ్నతో పెద్ద సమస్యే వచ్చింది. అయితే అతడు చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. దూబే ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా.. ఇద్దరూ గొప్ప కెప్టెన్లేనని చెప్పాడు.
‘ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ ప్రపంచకప్‌లు గెలిచిన కెప్టెన్లే. ఐపీఎల్లో ఐదేసి టైటిళ్లు సాధించిన ఘనత కూడా ఇద్దరికీ ఉంది. అందుకే ఒకరిని మరొకరితో పోల్చి ఎంచుకోవడం నా వల్ల కాదు. ఐపీఎల్ విషయానికి వస్తే ధోనీనే నా మొదటి ఎంపిక. మహీ భాయ్ బెస్ట్ టీ20 కెప్టెన్. నా కెరీర్‌ను మలుపు తిప్పిన వ్యక్తి ధోనీ. 2022లో ధోనీని నేను కలవకపోయి ఉంటే.. నా ఐపీఎల్ కెరీర్ ఈ స్థాయికి వచ్చేది కాదు. ధోనీ ఇచ్చిన నమ్మకం, మార్గదర్శకత్వం నాకు ఎంతో ఉపయోగపడింది’ అని శివమ్ దూబే చెప్పాడు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
- BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
- BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
‘అంతర్జాతీయ టీ20 క్రికెట్ విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మ బెస్ట్ టీ20 కెప్టెన్. 2024లో రోహిత్ భాయ్ నాకు ఇచ్చిన మద్దతు మరువలేనిది. ఆయన కారణంగానే భారత్ తరఫున రెండు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచే అవకాశం నాకు దక్కింది. అందుకే ఐపీఎల్‌కు ధోనీ, అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మను బెస్ట్ కెప్టెన్’ అని శివమ్ దూబే వివరించాడు.టీమిండియా తరఫున ఇప్పటివరకు దూబే 6 వన్డేలు, 76 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన దూబే.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలడు. ధోనీ, రోహిత్‌లలో ఎవరు గొప్ప కెప్టెన్ అనే ప్రశ్నకు నేరుగా ఒక్కరి పేరే చెప్పకుండా.. ఇద్దరూ తన కెరీర్లో కీలక పాత్ర పోషించారని చెప్పి దూబే తపించుకున్నాడు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!