Salman Ali Agha: అదే మా కొంపముంచిది.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌తో మ్యాచ్‌లో కలిసి రాలేదు
- మా ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యం
- ఓటమి నుంచి త్వరగా బయటపడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో మ్యాచ్‌లో కీలక సందర్భాల్లో తమ ప్రణాళికలు పని చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ చెప్పాడు. కీలక పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. గత ఆరు నెలలుగా తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే వారిపైనే నమ్మకం ఉంచామని.. అయితే భారత్‌తో మ్యాచ్‌లో వారికి కలిసి రాలేదని వివరించాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం సల్మాన్ అఘా అలీ మాట్లాడుతూ… ‘మా స్పిన్నర్లపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. అయితే ఈరోజు ఆశించిన స్థాయిలో వారు రాణించలేకపోయారు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. అయితే మా స్పిన్నర్లపై నమ్మకం ఉంది. ఎందుకంటే గత 6 నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నారు. మా బ్యాటింగ్ చాలా చెత్తగా ఉంది. పవర్‌ప్లేలోనే మూడు లేదా నాలుగు వికెట్లు కోల్పోతే టీ20ల్లో ఎప్పుడూ ఒత్తిడిలోనే మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. మాకు మంచి ఆరంభం దక్కలేదు, అందుకే మ్యాచ్‌ను ఛేజ్ చేయడం కష్టమైంది’ అని చెప్పాడు.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
మొదట బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా… ‘మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ కొంచెం స్టిక్కీగా ఉంది. బంతి గ్రిప్ అవుతోందని భావించాం. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ మెరుగ్గా మారుతుందని భావించి.. ఆ నిర్ణయం తీసుకున్నాము. కానీ బౌలర్లు పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇలాంటి హైప్రెజర్ మ్యాచ్‌ల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అనుభవం ఉన్న జట్టుగా వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు రోజుల్లో మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమి నుంచి త్వరగా బయటపడి.. మళ్లీ ఫోకస్ పెట్టాలి. వచ్చే మ్యాచ్ గెలిస్తే సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాం. అక్కడి నుంచి కొత్త టోర్నీలా భావించి ముందుకు వెళ్లాలి’ సల్మాన్ అఘా తెలిపాడు.
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!