Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను “హ్యాండ్‌షేక్ వివాదం” కారణంగా ఆడకుండా బహిష్కరించినట్లు సమాచారం. అందిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకునట్లు సమాచారం. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై సరిగా వ్యవహరించలేదని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)…
Pakistan: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీకే హైలెట్‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టికరిపించింది. ఇదిలా ఉంటే, ఈ ఓటమి కన్నా, పాకిస్తాన్ జట్టును, ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, ‘‘షేక్ హ్యాండ్’’ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా…
ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతడు మెడ నొప్పితో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మీడియా జియో న్యూస్ పేర్కొంది. బుధవారం జరిగిన పాక్ ప్రాక్టీస్ సెషన్‌కు అఘా దూరంగా ఉన్నాడు. మిగతా ప్లేయర్స్ మాత్రం సాధనను కొనసాగించారు. పాక్ జట్టుతో కలిసి దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీకి వచ్చినా.. మెడకు బ్యాండేజ్ వేసుకొని కనిపించాడు. ఇందుకు…
పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ అఫ్రిదిలను T20 జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ త్వరలో బంగ్లాదేశ్ ,వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సీనియర్లను పక్కనపెట్టింది. రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలో జరిగిన T20 అంతర్జాతీయ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ ఆజం కూడా ఉన్నాడు. దీంతర్వాత బాబర్, రిజ్వాన్…