Team India: ఆఖరి ఓవర్‌లో హైడ్రామా.. క్రీడా స్ఫూర్తి చాటుకున్న రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మన్కడింగ్ రనౌట్‌కు ప్రయత్నించగా రోహిత్ శర్మ నిరాకరించాడు. షమీ చేసిన అప్పీల్‌ను వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుని అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. శ్రీలంక ఇన్ని్ంగ్స్ జరుగుతున్న సమయంలో మహ్మద్ షమీ చివరి ఓవర్ వేశాడు. అయితే నాలుగో బంతి సమయంలో శ్రీలంక కెప్టెన్ షనక 98 పరుగులతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. సెంచరీపై ఫోకస్ పెట్టిన అతడు సింగిల్ తీసివ్వాలని స్ట్రైకింగ్‌లో ఉన్న రజితకు సూచించాడు.
Read Also: RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
Also Read
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డర్లను సర్కిల్ లోపల పెట్టగా షమీ బంతి వేయక ముందే షనక క్రీజు దాటాడు. ఇది గమనించిన షమీ.. మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకోని షమీ చేత అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. అనంతరం ఆట కొనసాగగా.. షనక బౌండరీతో వన్డే కెరీర్‌లో తన రెండో సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం షనకను ప్రత్యేకంగా రోహిత్ శర్మ అభినందించాడు. కాగా మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ ఇలా మన్కడింగ్ చేస్తాడని ఊహించలేదన్నాడు. 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న షనకను ఇలా ఔట్ చేయడం సరికాదని భావించే అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశాడు.
*Shami Mankaded Shanaka and Rohit Sharma told Shami to withdraw the appeal…Good Gesture from the Indian Captain*❤️😍
Video Courtesy : SuperSport #INDvsSL #RohitSharma #Shami #mankading #IndianCricketTeam #ViratKohli𓃵 pic.twitter.com/x1bIV2lGuh— Rohind N Mani (@rohind_) January 10, 2023
తాజావార్తలు
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు