ఒంటె పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో వీటి వాడకం ఎక్కువగా లేనప్పటికి గల్ఫ్ దేశాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఒంటె పాలు, అలాగే పాల పొడి ఆన్ లైన్ లో విరివిరిగి లభిస్తాయి.
ఒంటె పాలల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ మైక్రోబయాల్ గుణాలు కూడా ఉన్నాయి.
ఆవు పాలల్లో , ఒంటె పాలల్లో దాదాపు సమానమైన పోషకాలు ఉన్నప్పటికి ఒంటె పాలల్లో విభిన్న ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు.
ఒంటె పాలల్లో విటమిన్ సి తో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. అలాగే ఒంటెపాలు త్వరగా జీర్ణమయ్యే గుణాన్ని కూడా కలిగి ఉన్నాయి.
అధిక రక్తపోటును తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఒంటెపాలు చక్కగా పని చేస్తాయని నిపుణులు కనుగొన్నారు.
ఒంటె పాలల్లో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉన్నాయని అందుకే ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని వారు చెబుతున్నారు.
4 కప్పుల ఒంటె పాలు 52 యూనిట్ల ఇన్సులిన్ తో సమానమైనదని వారు తెలియజేస్తున్నారు.
ఒంటె పాలు తాగిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నాయని వారు కనుగొన్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు రోజుకు 500 ఎమ్ ఎల్ ఒంటె పాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటుంది.
ఒంటె పాలల్లో ఇన్సులిన్ నానో పార్టికల్స్ రూపంలో ఉంటుంది. ఇది చిన్న ప్రేగు ద్వారా త్వరగా గ్రహించబడి త్వరగా రక్తంలో కలుస్తుంది.
ఒంటె పాలను తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడంతో పాటు వీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి.