కన్నడ బ్యూటీ రష్మీక మందాన ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. అయితే రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఆ మధ్య “ఈ సాలా కప్ నమ్‌దే” అంటూ సొంత రాష్ట్రానికి చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తనను ఇష్టమైన జట్టు అని తెలిపింది. దాంతో రష్మీక ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనే అనుకున్నారంత. కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా నా ఫెవరేట్ క్రికెటర్ ”మహేంద్ర సింగ్ ధోనీ ” అని తెలిపింది .’ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ .. అంటే చాలా ఇష్టమని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తుంది రష్మిక.