Rahane on Siraj: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతమై ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్. అత్యధిక వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు. స్టేడియంలో దూకుడుగా ఉండే అతడు ప్రత్యర్థి జట్టు పైనే కాదు.. అప్పుడప్పుడు సొంత టీమ్ సభ్యుల పైనా కూడా సీరియస్ అవుతుంటాడు.. ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్, ధ్రువ్ జురెల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, అజింక్య రహానే సారథ్యంలో 2020-21లో బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఆ సిరీస్ లో అరంగేట్రం చేసిన సిరాజ్.. అప్పుడు చాలా దూకుడుగా ఉండేవాడు.. దాని వల్ల అతనిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుందని చెప్పుకొచ్చాడు.
Read Also: JK Encounter: కుల్గాంలో ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
ఇక, అజింక్య రహానె మాట్లాడుతూ.. నేను సారథిగా ఉన్నప్పటికీ తనపైనా కూడా సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేసుకున్నాడు. అయితే, అతడిని ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకురావడంతో ఓసారి నాపైనా సీరియస్ అయ్యాడు.. ఈ కోపం అతడిలోని బెస్ట్‌ను బయటకు తీసుకొస్తుంది అన్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే చూశాం.. తొలి బంతితోనే ప్రత్యర్థి జట్టుకి హెచ్చరికలు జారీ చేశాడు. సిరాజ్ అత్యుత్తమైన బౌలర్ అనడంలో సందేహం లేదన్నారు. సిరాజ్ విషయంలో నాకు ఎప్పటికీ నచ్చే విషయం ఒక్కటి ఉంది.. సుదీర్ఘంగా స్పెల్స్ వేసేందుకు అతడు ఎప్పటికీ రెడీగా ఉంటాడని రహానే చెప్పుకొచ్చాడు.