అజింక్య రహానె మాట్లాడుతూ.. నేను సారథిగా ఉన్నప్పటికీ తనపైనా కూడా సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేసుకున్నాడు. అయితే, అతడిని ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకురావడంతో ఓసారి నాపైనా సీరియస్ అయ్యాడు.. ఈ కోపం అతడిలోని బెస్ట్‌ను బయటకు తీసుకొస్తుంది అన్నాడు.
నరాలు తెగే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ యువ భారత్ అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ను అద్వితీయమైన ఆటతీరుతోముగించింది. థ్రిల్లింగ్ విక్టరీతో టీమ్ఇండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ క్రికెట్ ప్రేమికులకు ఫుల్ జోష్ ఇచ్చినట్లైంది. ఇన్నిరోజులు టీ20, వన్డే మ్యాచ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపే క్రికెట్ లవర్స్ ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లకు సైతం ఎప్పుడెప్పుడా…
IND vs ENG: బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజున టీమిండియా ఓ మోస్తారుగా మంచి స్థానంలో ఉందనే చెప్పవచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ కి హీరోగా నిలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో జట్టును నడిపించాడు. ఇక మొదటి రోజు భారత బ్యాటింగ్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.…
ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ చివరి, ఐదవ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్ జట్టుకు విజయంకోసం 350 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులు…
Red Bull Ultimate Cricket Challenge: ఇంగ్లాండ్ తో జూన్ 20 నుండి జరగబోతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా.. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం అతను టీమ్ ఇండియాలో భాగంగా సిద్ధమవుతున్నాడు. అయితే టెస్ట్ సిరీస్‌కి ముందు రాహుల్ ఒక విభిన్నమైన క్రికెట్ అనుభవాన్ని పంచుకుంటూ కనిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్…
Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకస్మికంగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా జట్టును వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. జూన్ 20న ప్రారంభమయ్యే భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముందు, అతను స్వదేశం చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం.. గంభీర్ తన తల్లి ఆరోగ్యం కారణంగా భారత్ కు చేరుకున్నాడు. అందిన సమాచారం మేరకు జూన్ 11న గంభీర్ తల్లి శీమా గంభీర్…
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని…
Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…