టీ20 ప్రపంచకప్: సూపర్-12లోకి అడుగుపెట్టిన నమీబియా

టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ A నుంచి శ్రీలంక, నమీబియా… గ్రూప్ B నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కు అర్హత సాధించాయి. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో నమీబియా సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ జట్టులో పార్ల్ స్టిర్లింగ్ 38 పరుగులు, కెవిన్ ఓబ్రెయిన్ 25 పరుగులు, బాల్బిరిన్ 21 పరుగులు చేశారు. నమీబియా జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జాన్ ఫ్రైలింక్ 3 వికెట్లు, డేవిడ్ వీస్ రెండు వికెట్లు సాధించారు.

Read Also: ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి 36 వేల కోట్ల ఆదాయం..?

అనంతరం 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు ఓపెనర్లు ఆరంభంలో ఆచితూచి ఆడారు. క్రెయిగ్ విలియమ్స్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. గ్రీన్ 24 పరుగులు, ఎరాస్‌మస్ 53 పరుగులు చేసి నమీబియా విజయాన్ని ఖరారు చేశాడు. అతడికి డేవిడ్ వీస్ 28 పరుగులు చేసి అతడికి సహకరించాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్యాంఫర్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, నమీబియా తలపడనున్నాయి.

Related Articles

Latest Articles