PV Sindhu: క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11తో గ్రెగోరియా మరిస్క టుంజుంగ్ (ఇండోనేసియా)పై చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్ 10-5తో సులభంగా గేమ్ గెలిచేలా కనిపించింది. కానీ పుంజుకున్న గ్రెగొరియా.. సింధుకు గట్టిపోటీ ఇచ్చింది. ఆ తర్వాత గేమ్‌లోనూ సింధు ప్రతి పాయింట్‌కూ చెమటోడ్చక తప్పలేదు. ఒక దశలో ఆమె 5-10తో వెనకబడింది. కానీ పుంజుకున్న సింధు 15-15తో స్కోరు సమం చేసింది. ఆఖర్లో తడబడిన సింధు గేమ్ చేజార్చుకుంది. కానీ మూడో గేమ్‌లో సింధు.. గ్రెగొరియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 7-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక ఆ తర్వాత అదే జోరుతోడి తేలిగ్గా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 71 నిమిషాల పాటు ఈ పోరు సాగడం విశేషం.
Also Read
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ లక్ష్య సేన్ 21–18, 21–15తో రాస్మస్ జెమ్కే (డెన్మార్క్)పై ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం సుమీత్ రెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి పరాజయంతో వెనుదిరిగింది. రెండో సీడ్ చైనా ద్వయం జెంగ్ సీ వీ– హువాంగ్ కియాంగ్ 21–18, 21–13తో భారత జంటను ఓడించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!