Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మనిషి ఎన్నో ఏళ్లుగా తాగుతున్న మద్యాన్ని ఒక్కరోజులో వదిలేయగలడు. నెలల తరబడి మద్యం వైపు చూడకుండా ఉండగలడు. కానీ రోజుకు ఐదారు సిగరెట్లు తాగే వ్యక్తి మాత్రం కొన్ని గంటలు కూడా సిగరెట్ లేకుండా ఉండలేకపోవచ్చు.
అసలు ఎందుకిలా జరుగుతుంది? ఒక అలవాటును వదిలించుకోవాలంటే మనిషికి కావాల్సింది సంకల్పమా? లేదా మెదడుతో చేసే పోరాటమా? మరోసారి సిగరెట్ ధరలు పెరిగిన వేళ.. స్మోకింగ్ అడిక్షన్ గురించి చర్చ మొదలైంది.
Also Read
సిగరెట్లో ఉండే నికోటిన్ అనే రసాయనం మెదడులోని రివార్డ్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇది డోపమైన్ అనే రసాయనం విడుదలను ప్రేరేపిస్తుంది. దీని కారణంగా కొద్దిసేపు హాయిగా ఉన్నట్లు, ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. క్రమంగా మెదడు ఆ అనుభూతికి అలవాటుపడుతుంది. మళ్లీ మళ్లీ అదే అనుభూతిని కోరుకుంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
ఉదయం నిద్రలేవగానే ఒక సిగరెట్. టీ తాగేటప్పుడు ఇంకొకటి. భోజనం తర్వాత మరొకటి. పని ఒత్తిడి పెరిగితే ఇంకొకటి. ఇలా సిగరెట్ అనేది ఒక వస్తువుగా మిగలదు. మనిషి రోజువారీ జీవితంలో ఒక భాగమైపోతుంది. సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్నప్పుడు నికోటిన్ అందకపోవడంతో చిరాకు, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం, నిద్ర సమస్యలు, తీవ్రమైన కోరికలు మొదలవుతాయి. వీటినే విత్‌డ్రాయల్ లక్షణాలు అంటారు. అందుకే చాలామంది కొన్నిరోజులు ఆపి మళ్లీ సిగరెట్ చేతిలోకి తీసుకుంటారు. మరి మద్యపానం సంగతేంటి?
ఆల్కహాల్ కూడా మెదడులోని రివార్డ్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దానిపై ఆధారపడటం ఏర్పడితే మానుకోవడం కూడా చాలా కష్టమే. పైగా తీవ్రమైన ఆల్కహాల్ డిపెండెన్సీ ఉన్నవారు వైద్య పర్యవేక్షణ లేకుండా అకస్మాత్తుగా మానేస్తే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు.
అంటే సిగరెట్ మానడం మద్యం మానడం కంటే కష్టమని చెప్పడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. రెండింటి వ్యసన స్వభావం, తీవ్రత, వ్యక్తిగత పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఒక విషయం మాత్రం నిజం. సిగరెట్ తాగే వ్యక్తికి రోజులో ఎన్నో సందర్భాలు దాన్ని గుర్తుచేస్తుంటాయి. ఒక్కోసారి సిగరెట్ తాగాలనే కోరిక కంటే, సిగరెట్‌తో ముడిపడిపోయిన అలవాట్లను వదిలించుకోవడమే పెద్ద సవాలుగా మారుతుంది.
ఒక చిన్న సిగరెట్ వెనుక నికోటిన్ ప్రభావం మాత్రమే ఉండదు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన జ్ఞాపకాలు, అలవాట్లు, మెదడు నేర్చుకున్న ఒక చిన్న ఆనందం కూడా ఉంటుంది. అందుకే సిగరెట్ ఆర్పేయడం కొన్ని సెకన్ల పని. కానీ దాని జ్ఞాపకాన్ని మెదడు నుంచి చెరిపేయడానికి మాత్రం చాలా సమయం పట్టవచ్చు.
తాజావార్తలు
-
Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
-
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
-
Soil: మట్టి…! బంగారం కంటే ఎందుకు విలువైంది?
-
Vivo X500 Series: వివో X500 Series ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ
-
Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!