IPL 2022: గుజరాత్ వరుస విజయాలకు పంజాబ్ బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ (62) మంచి ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో(1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స(40) ధావన్‌కు మంచి సహకారం అందించాడు. రాజపక్స అవుటైనా ఆఖర్లో లివింగ్ స్టోన్(30) మెరుపులు మెరిపించడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపు సొంతం చేసుకుంది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 50 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 64 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు సాధించాడు. అర్షదీప్ సింగ్, రిషి ధావన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. గుజరాత్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Also Read
- Vaibhav Batting: ‘నా బౌలింగ్‌లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్‌కు బౌలింగ్ వేయలేను’..
- Vaibhav Sooryavanshi: అమ్మా... నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
- Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్‌పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
- Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక్కటే ఛాన్స్!
Cricket: వెస్టిండీస్ కొత్త కెప్టెన్‌గా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు
తాజావార్తలు
-
Mandula Samuel : కాంగ్రెస్‌లో కాక రేపిన సామేల్.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫైర్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
-
New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
-
Vaibhav Batting: ‘నా బౌలింగ్‌లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్‌కు బౌలింగ్ వేయలేను’..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!