T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు పాకిస్థాన్ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం పెర్త్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల విజయ లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఈ మెగా టోర్నీలో బోణీ చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఛేదనలో కీలకపాత్ర పోషించాడు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు. అటు కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి విఫలమయ్యాడు. నాలుగు పరుగులకే అతడు రనౌట్ అయ్యాడు. ఫకార్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశారు.
Read Also: Roger Binny: పాకిస్థాన్ సెమీస్‌కు చేరడం కష్టమే.. చిన్న జట్లను తేలిగ్గా తీసుకోకూడదు
మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్ కలిసి పాకిస్థాన్‌ను విజయం వైపు నడిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశాడు. కాగా సూపర్-12 దశ తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్, రెండో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో జింబాబ్వేపై పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 91 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో అకేర్‌మన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎడ్వర్డ్స్ 15 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.