Asia Cup Controversy: ఆదివారం (డిసెంబర్ 21న) అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు భారత్‌పై 191 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ 13 ఏళ్ల తర్వాత రెండోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మన్ సమీర్ మిన్హాస్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 113 బంతుల్లో 172 పరుగులు చేసి జట్టును 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అండర్-19 జట్టు, కెప్టెన్ ఆయుష్ మాత్రే నేతృత్వంలోని టీం పూర్తిగా విఫలమైంది. కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది.
Read Also: Mumbai: ఎయిర్‌పోర్టులో రూ.49 కోట్ల గంజాయి పట్టివేత.. స్మగ్లర్లు అరెస్ట్
అయితే, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత అండర్-19 జట్టు ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు. “క్రికెట్‌ను గౌరవించే భారత జట్లతో మేము ఆడాం.. కానీ ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రవర్తన క్రీడాస్పూర్తికి అవమానకరంగా అనిపించింది అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మ్యాచ్ జరిగే సమయంలో పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సర్ఫరాజ్ తమ ఆటగాళ్లతో మాట్లాడుతూ, “అజ్ఞానంతో ప్రవర్తించే వారిని చూసి మనం కూడా అలా ప్రవర్తించకూడదు.. మర్యాదతోనే ఆట ఆడాలి” అని చెప్పినట్లు వీడియోలో ఉంది. ఈ వ్యాఖ్యలు తానే చేసినవని సర్ఫరాజ్ తర్వాత మీడియా సమావేశంలో ధృవీకరించారు.