T20 World Cup: పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..
- బంగ్లాకు మద్దతుగా టీ20 ప్రపంచకప్‌ను పాక్ బహిష్కరిస్తుందా?
- కీలక వ్యాఖ్యలు చేసిన పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో టీ20 వరల్డ్ కప్-2026(T20 World Cup 2026) ఆడేందుకు నిరాకరించినందుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నుంచి తమ వేదికను శ్రీలంకకు మార్చాలని, లేదంటే టోర్నీలో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీసీ) చెప్పింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అయిన నేపథ్యంలో, పాకిస్తాన్ టోర్నీలో పాల్గొంటుందా? అనే దానిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌పై ఐసీసీ వ్యవహరించిన తీరును విమర్శించారు.
Read Also: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం గంట పాటు నిలిచిన రైళ్లు..
Also Read
- IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
- VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
బంగ్లాదేశ్ నిష్క్రమణపై నఖ్వీ స్పందిస్తూ.. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అనుమతించాలని నఖ్వీ అన్నారు. “బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. మీరు ద్వంద్వ ప్రమాణాలను పాటించలేరు, ఒక దేశం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ మరో దేశం విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు. అందుకే బంగ్లాదేశ్‌కు అన్యాయం జరుగుతోందని, ఏదేమైనా వారిని ప్రపంచ కప్‌లో ఆడేందుకు అనుమతించాలని మేము వైఖరి తీసుకున్నాము. వారు ఒక ప్రధాన వాటాదారులు, వారికి ఈ అన్యాయం జరగకూడదు’’ అని అన్నారు.
బంగ్లాదేశ్ లాగే పాకిస్తాన్ కూడా టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని పాటిస్తామని చెప్పారు. పాక్ ప్రధాని పాకిస్తాన్‌లో లేరని, ఆయన వచ్చాక తుది నిర్ణయాన్ని చెబుతామని, తాము ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తామని, ఐసీసీని కాదు అని చెప్పారు. భారత్‌లో జరిగే ఈ ఐసీసీ ఈవెంట్‌ల విషయానికి వస్తే పాకిస్తాన్ హైబ్రీడ్ మోడల్‌లో ఆడుతోంది. దాని మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. బంగ్లాదేశ్‌కు కూడా ఇలాంటి సహాయమే చేయాలని చెప్పారు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!