Site icon NTV Telugu

Pakistan Name In Indian Jersey: భారత జట్టు జెర్సీలపై పాకిస్థాన్‌ పేరు..

Pak Name

Pak Name

Pakistan Name In Indian Jersey: రేపటి నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు రెడీ అవుతుంది. తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఈనెల 20వ తేదీన దుబాయ్‌ వేదికగా పోటీ పడబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో తాజాగా పంచుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్ మన్ గిల్, రిషభ్‌ పంత్‌, మహమ్మద్‌ షమీ తదితరులు నూతన జెర్సీలతో తాము మెగా సమరానికి సిద్ధమంటూ ఫొటోలకు పోజులిచ్చారు.

Read Also: Jacqueline : సినిమాలు లేక స్పెషల్ సాంగ్స్ తో నెట్టుకొస్తున్నహాట్ బ్యూటీ

ఇక, ఈ జెర్సీలపై టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చే పాకిస్థాన్‌ ఉంది. అయితే, టీమిండియా జెర్సీలపై పాక్‌ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్‌ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్‌ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ ఆదేశాలను ఉల్లంఘించాలని మేము అనుకోవడం లేదన్నారు. పేరు తొలగించాలని తమకు ఎలాంటి డిమాండ్ రాలేదన్నారు. టీమిండియా జెర్సీలపై ఉండే ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌కు హక్కు ఉందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా వెల్లడించారు.

Read Also: Gold Rates: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరింత పైపైకి బంగారం ధరలు

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ తండ్రి మరణించడంతో దుబాయ్‌ నుంచి స్వదేశానికి పయనమైనట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఈ నెల 15న దుబాయ్‌ చేరుకున్న భారత జట్టు బృందంలో మోర్కెల్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పలు ట్రైనింగ్‌ సెషన్లలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే, సోమవారం నాడు మాత్రం ప్రాక్టీస్‌ సెషన్‌కు రాలేదు. అనివార్య కారణాలతో మోర్కెల్ జట్టును వీడినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. అతడు ఎప్పుడు తిరిగి వచ్చే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Exit mobile version