IPL 2022 : మళ్లీ ఓడిన కేకేఆర్.. ఢిల్లీదే విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ సీజన్ 2022 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా జట్ల మధ్య పోటీ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్లలోనే ఈ సీజన్ ప్రత్యేకంగా నిలుస్తుందని కొందరు క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే నేడు ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ను ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. డీసీ అరంగేట్రం బౌలర్ చేతన్ సకారియా బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ (7 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
అయితే అనంతరం.. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయినప్పటికీ ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ (42), మధ్యలో లలిత్ యాదవ్ (22), అక్షర్ పటేల్ (27) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించగా.. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/24) ఆరంభంలోనే వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. హర్షిత్ రాణా, నరైన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఢిల్లీ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది.
Also Read
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
- Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
- Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
తాజావార్తలు
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!