Srikanth: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్.. ఆ వెబ్‌సైట్స్‌పై చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Srikanth Denies Divorce Rumours: తను, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అబద్దపు వార్తలు ప్రచారం అవటంపై హీరో శ్రీకాంత్ స్పందించారు. ఈ విషయమై మాట్లాడుతూ ‘అసలు ఇలాంటి పుకార్లను ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావటం లేదు. ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తల వల్ల వారికి ఏం ఉపయోగమో తెలియటం లేదు. గతంలో కూడా నేను చనిపోయినట్లు పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్రమైన ఆందోళనకు గురి చేశారు. తాజాగా ఆర్థిక ఇబ్బందుల కారణాలతో విడాకులు తీసుకుంటున్నాం అంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తను స్నేహితులు ఊహకు పంపటంతో తను కంగారుపడింది. వాటిని నమ్మవద్దని తనను ఓదార్చాను’ అని అన్నారు.
‘ఇలా కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ చేసిన ఈ పనితో వివరణ ఇవ్వవలసి రావటం న్యూసెన్స్‌గా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీతో చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి పుకార్లు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం వివరణ ఇస్తున్నాను. నా మీదనే కాదు చాలామంది ప్రముఖుల మీద కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ తీవ్రస్థాయిలో ఖండించారు హీరో శ్రీకాంత్.
Also Read
- The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
- Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ - డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
- Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?