MI vs RCB: లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ముంబై.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Scored 99 Runs In First 10 Overs Against RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న దూకుడే కొనసాగిస్తే.. ముంబై జట్టు లక్ష్యాన్ని ఛేధించగలదు. అలా జరగకుండా ఉండాలంటే.. ఆర్సీబీకి కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. బ్యాటర్లను కట్టడి చేస్తూ.. వికెట్లు తీస్తూ ఉండాలి. ఇంకా గ్రీన్, టిమ్ డేవిడ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కూడా ఉన్నారు కాబట్టి.. ఆర్సీబీ బౌలర్లు చాలా జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. కాస్త తేడా కొడితే మాత్రం.. ముంబై విజయాన్ని ఎగరేసుకు పోతుంది.
Asia Cup 2023: పాకిస్తాన్‌కి షాక్.. పంతం నెగ్గిన భారత్
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!

తొలుత ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన ఇషాన్, రోహిత్ శర్మ.. తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. రోహిత్ శర్మ ఖాతా తెరవలేదు కానీ.. ఇషాన్ కిషన్ మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కి వీళ్లిద్దరు 51 పరుగుల భాగస్వామ్యం జోడించగా.. అందులో 42 పరుగుల ఇషాన్‌వే. దీన్ని బట్టి అతడు ఏ రేంజ్‌లో చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ప్రతి బౌలర్‌లోనూ అతడు బౌండరీల మోత మోగించాడు. పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. మొత్తం 24 బంతులు ఆడిన అతగాడు.. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. అయితే.. ఆ ఊపులోనే అతడు ఔట్ అయ్యాడు. అనవసరమైన బంతికి టెంప్ట్ అయ్యి, వనిందు హసరంగ బౌలింగ్‌లో కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్‌లో రోహిత్ శర్మ సైతం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ పోయాక క్రీజులోకి వచ్చిన నేహాల్, సూర్య.. చాలా చాకచక్యంగా రాణిస్తున్నారు. ఆచితూచి ఆడుతూనే.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?