రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ కి రిటైర్మింట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. అయితే ఇప్పటికే సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. మిగిలిన ప్లేయర్లు కలలో కూడా ఊహించనిన్ని పరుగులు, మ్యాచ్ లు, బౌండరీలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు. క్రికెట్ దేవుడిగా కీర్తి ఘడించిన సచిన్ టెండూల్కర్.. ఏప్రిల్ 24న 50వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.
Also Read : Today Business Headlines 22-04-23: హలీం కన్నా బిర్యానీకే సలాం. మరిన్ని వార్తలు
అయితే అంతకంటే ముందుగానే ఏప్రిల్ 22న( ఇవాళ ) 22వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు, పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కి ముందు సచిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగబోతున్నాయి. ఇన్సింగ్స్ 10వ ఓవర్ ముగిసిన తర్వాత గ్రౌండ్ మొత్తం సచిన్.. సచిన్.. నామస్మరణతో మార్మోగిపోతుంది.
Also Read : Maama Mascheendra : డిఫరెంట్ గా ఉంది.. కానీ ఎక్కడో చూసినట్లుందే
స్టేడియంలో ఉన్న 33 వేల మంది 33 వేల మంది టెండూల్కర్ ఫేస్ మాస్కులతో కనిపించబోతున్నారు. అంటే గ్రౌండ్ లో ప్రతీ సీటులోనూ సచిన్ టెండూల్కరే ఉంటాడు. గ్రౌండ్ లోని ప్రతీ వ్యక్తి, సచిన్ టెండూల్కర్ తనకున్న ప్రతిష్టించబోతున్నాం.. అక్కడ ఆ బొమ్మతో మీరు సెల్పీలు దిగవచ్చు.. అంటూ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఐపీఎల్ లో ఎప్పుడూ కూడా ఓ క్రికెటర్ పుట్టిన రోజు వేడుకలు ఈ రేంజ్ లో ఇంతకుముందు జరుగలేదు.. మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు కూడా డ్రెస్సింగ్ రూమ్ లో కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నారు.
Also Read : Jagananna Mana Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్‌కు విశేష స్పందన.. టాప్ 5లో ఉంది ఈ ఎమ్మెల్యేలు..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50వ పుట్టిన రోజు వేడుకలతో ఓ కొత్త సంస్కృతికి ముంబై ఇండియన్స్ తెర లేవనుంది. మొదటి రెండు మ్యాచ్ ల్లో చిత్తుగా ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి అద్భుతమైన కమ్ బ్యాక్ ముంబై ఇచ్చింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో అదిరిపోయే బౌలింగ్ చేసి ఇంప్రెస్ చేశాడు. సచిన్ బర్త్ డే వేడుకల్లో అర్జున్ టెండూల్కర్ తో పాటు కూతురు సారా టెండూల్కర్, భార్య అంజలి కూడా పాల్గొనబోతున్నారు.
